మల్టీస్టారర్ మూవీతో  నాగార్జున, నరేష్ ?

మల్టీస్టారర్ మూవీతో  నాగార్జున, నరేష్ ?

నాగార్జునకు యాక్షన్ సినిమాలు అంతగా అచ్చి రాకున్నా మరోసారి యాక్షన్ చిత్రాన్ని తీయడానికి సిద్ధం అవుతున్నాడు. అయితే, ఈ సారి వచ్చే సినిమా మల్టీస్టారర్ గా ఉండబోతోంది. నాగార్జునతో పాటు అల్లరి నరేష్ ఈ సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికి మూడు మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన నరేష్, అన్నింట్లో సూపర్ హిట్ సాధించాడు.  రైటర్ ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా త్వరలో తెరకెక్కనుంది. 

ఈ సినిమాలో  హీరోతో సమానంమైన పాత్రని అల్లరి నరేష్ పోషించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన చర్చలు ఇప్పటికే ముగిశాయి. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ లో ఉండనుంది. సినిమాకు టైటిల్, సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.