గండిపేట, వెలుగు: శంషాబాద్ మండల తహసీల్దార్‌గా అమరలింగం సోమవారం బాధ్యతలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఈ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త తహసీల్దార్‌గా నియమితులైన అమరలింగం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
