రాజమండ్రి జైలుకు అంబటి.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

రాజమండ్రి జైలుకు అంబటి.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

మాజీ మంత్రి అంబటి రాంబాబును రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనను శనివారం ( జనవరి 31 ) అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదివారం ( ఫిబ్రవరి 1 ) అంబటి రాంబాబును గుంటూరు ప్రత్యేక సివిల్  కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. 

జనవరి 31న వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటి కర్రలతో, రాళ్లతో వచ్చి కారును అడ్డుకొని దుర్భాషలాడారు టీడీపీ కార్యకర్తలు.. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అంబటి టీడీపీ కార్యకర్తలు, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

►ALSO READ | అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు 

ఈ క్రమంలో అంబటి ఇంటిపై దాడికి పాల్పడ్డారు టీడీపీ కార్యకర్తలు. ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేసి.. ఇంటికి నిప్పంటించారు. దీంతో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. జడ్జి ముందు హాజరు పరిచిన సమయంలో అంబటి తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనను శారీరకంగా వేధించారని.. రాత్రి సమయంలో తనను దుర్భాషలాడారని అంబటి జడ్జికి చెప్పినట్లు తెలుస్తోంది.

తనకు చట్టపరమైన సాయం అందించాలని జడ్జిని కోరినట్లు తెలుస్తోంది. తనకు కలవడానికి జైలుకు వచ్చేవారిని కూడా అనుమతించలేదని కోర్టు ముందు తన బాధ చెప్పుకున్నట్లు తెలుస్తోంది.