జూలై 26న రాష్ట్రానికి అమిత్ షా..కరీంనగర్‌‌ లో ప్రైవేట్‌ ప్రోగ్రామ్‌కు హాజరు

జూలై 26న రాష్ట్రానికి అమిత్ షా..కరీంనగర్‌‌ లో ప్రైవేట్‌ ప్రోగ్రామ్‌కు హాజరు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 26న ఆయన తెలంగాణకు రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నిర్వహించనున్న కార్యక్రమానికి అమిత్​షా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

అనంతరం రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా రాకతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో అప్పుడే పొలిటికల్ హీట్ మొదలైంది.