కౌన్ బనేగా కరోడ్‌పతి 15 మళ్లీ మొదలైంది.. బిగ్ బీ క్రేజీ అప్డేట్

కౌన్ బనేగా కరోడ్‌పతి 15 మళ్లీ మొదలైంది.. బిగ్ బీ క్రేజీ అప్డేట్

బాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తోన్న పాపులర్ క్విజ్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 15 షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గేమ్ షో సెట్‌ నుండి కొన్ని చిత్రాలను పోస్ట్ చేశారు. ఇందులో అమితాబ్ KBC కోసం షూటింగ్ ప్రారంభించినట్లు మొదట ప్రకటించారు. ఆ తర్వాత దుస్తులు ధరించిన ఫొటోను పోస్ట్ చేశారు. ‘మళ్లీ మళ్లీ రిహార్సల్‌ చేస్తున్నా.. కేబీసీ కోసం..’ అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టి, మరో ఫొటోకు ‘ఇందులో పనిచేస్తున్నా.. కేబీసీ, ప్రిపరేషన్‌’ అని రాసుకొచ్చారు.

ఈ షోకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 29న ప్రారంభమవుతుందని ప్రకటన చేస్తూ మేకర్స్ గతంలోనే ప్రోమోను వదిలారు. ప్రోమోలో, అమితాబ్ హోస్ట్ సీటుపై కూర్చొని కనిపించారు. అయితే ఒక మహిళ హాట్-సీట్‌కు చేరుకోవడానికి మార్గాన్ని కనుగొనడానికి మ్యాప్‌ను చూస్తుంది. చివరకు భూమిని తవ్వి సెట్స్‌కి చేరుకుంది. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.

T 4713 - it begins again KBC .. ❤️

— Amitabh Bachchan (@SrBachchan) July 23, 2023