Anasuyabharadwaj: కుటుంబం గురించి గొప్ప మాటలు చెప్పిన అనసూయ

Anasuyabharadwaj: కుటుంబం గురించి గొప్ప మాటలు చెప్పిన అనసూయ

సినిమా..సినిమా..సినిమా..అంటూ మనసులో మెదిలే ఫ్యాషన్ కొరకు పరుగెడుతూ ఓ పోరాటం చేస్తుంటారు. వాళ్లెవరో కాదు.వాళ్ళనే సినిమా పిచ్చోల్లు అంటాం. అలా ఒకసారి వారికి సక్సెస్ వచ్చాక..వెనక్కి చూడకుండా ముందుకెళ్తూ ఉంటారు.

అందులో కొంత మంది కొన్నిసార్లు ఫ్యామిలీకి కూడా టైం కేటాయించని స్టార్స్ ఉన్నారు. అలానే మిడిల్ క్లాస్ యాక్టరర్స్ ఉన్నారు. కానీ అందరూ అలా కాదండోయ్..అల్లు అర్జున్, చరణ్, మహేష్, ఎన్టీఆర్..వీరంతా హీరోలుగానే కాదు ప‌ర్ఫెక్ట్ ఫ్యామిలీమ్యాన్స్ గా ఫ్యాన్స్ హృద‌యాల్ని గెలుచుకున్నారు.

ఇక వారి బాటలోనే యాంకర్ కమ్ యాక్టర్స్ అనసూయ (Anasuyabharadwaj) ప్రయాణం చేస్తోంది.ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంటూ..ఖాళీ టైంలో ఫ్యామిలీ కొరకు టైం కేటాయిస్తుంది. అనసూయ న్యూ ఇయర్ స్పెషల్ గా ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసి..ఒక మెసేజ్ను ఫ్యాన్స్కు తెలిపింది.

ఈ ఫోటోకి ట్యాగ్ ఇస్తూ..'ఆలోచించదగిన ప్రతి పద్ధతిలో..కుటుంబం అనేది మన గతానికి లింక్..మన ముందుండే భవిష్యత్తుకు వారధి..ఏది ఏమైనా నా కుటుంబంతో గడపడానికి నేను నా సమయాన్ని వెచ్చించగలను. అలా టైం ఇచ్చినపుడు అసలైన ఆనందం. ఇలా కొత్త రోజు..కొత్త వారం.. కొత్త నెల..కొత్త సంవత్సరం ఈ విధంగా! ధన్యవాదాలు` అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం అనసూయ చేసిన న్యూ ఇయర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ట్వీట్పై నెటిజన్స్ పలురకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది పాజిటివ్ మెసేజ్ ఇచ్చావు అంటే..మరికొంత మంది ఇంకో మంచి సంప్రదాయమైన ఫొటోతో చెప్పి ఉంటే బాగుండేది అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పుష్ప2 సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా  లైనప్లో ఉన్నాయి.