రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలి : ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలి :  ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
  •     కాంగ్రెస్ కేడర్​కు  ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పిలుపు

ఉప్పల్, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని మల్కాజిగిరి పార్లమెంట్ కో-ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలో కొత్త డివిజన్ అధ్యక్షుల నియామకంపై జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్, నియోజకవర్గ ఇన్​చార్జీ మందుముల పరమేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. 

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, ఆ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సంస్థాగతంగా బలంగా ఉంటే ఉప్పల్​లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, కష్టపడిన ప్రతి కార్యకర్తకూ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.