"అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ" సాంగ్ రిలీజ్

 "అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ" సాంగ్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం 'లెహరాయి'. ఈ సినిమాను నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ నిర్మాణ సంస్థలో మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో రామకృష్ణ పరమహంస ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమ‌స్ కావ‌టం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ముఖ్య‌తారాగాణం.

ఇక సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్ మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకుంది, ఆ సాంగ్ ను వంద‌ల్లో రీల్స్ చేయ‌టంతో ఈ పాటకు ఎంత పాపులారిటి వచ్చిందో తెలుస్తుంది. ఈ స‌క్సస్ ని పురస్కరించుకుని లెహ‌రాయి చిత్రం నుండి రెండ‌వ సాంగ్ ను కూడా విడుద‌ల చేశారు మేకర్స్. ఈ సాంగ్ ను సింగ‌ర్ సిధ్ధ్ శ్రీరామ్ ఆల‌పించారు. కాగా, తాజాగా ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ "అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ" అనే పాటను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశాడు. 

"ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి. ప్రతి పాట అల‌రించే విధంగా ఉంటుంది. మంచి ఫీల్ వున్న క‌థతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాను. త్వర‌లో రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయనున్నాము. ప్రముఖులు న‌టించిన ఈ చిత్రాన్ని నిర్మాత బెక్కం వేణుగోపాల్ స‌మ‌ర్పించ‌డం చాలా ఆనందంగా ఉందని ఇదివరకే ద‌ర్శకుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస" తెలిపారు.   

నటీనటులు: రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ,సత్యం రజెష్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు.

సాంకేతిక నిపుణులు :
ప్రజెంట్ : బెక్కం వేణుగోపాల్ 
బ్యానర్ : ఎస్ ఎల్ ఎస్ మూవీస్ 
సినిమా : లెహరాయి  
నిర్మాత : మద్దిరెడ్డి శ్రీనివాస్ 
రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస 
మ్యూజిక్ : జీకే (ఘంటాడి కృష్ణ) 
డి.ఓ.పి : ఎం ఎన్ బాల్ రెడ్డి 
ఎడిటర్ : ప్రవీణ్ పూడి 
లిరిక్ రైటర్స్ : రామజోగయ్య శాస్త్రి,
ఫైట్ మాస్టర్ : శంకర్ 
కొరియోగ్రాఫర్స్ : అజయ్ సాయి
రైటర్ : పరుచూరి నరేష్ 
పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్