కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేవారి వయోపరిమితిని మరోసారి పెంచింది. ఇప్పటికే 7ఏళ్లు వయోసడలింపు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మరో మూడేళ్లు వయోపరిమితిని సడలించింది.దీంతో కానిస్టేబుల్ అభ్యర్థులకు మొత్తం 10ఏళ్ల వయోపరిమితి సడలింపు లభించింది. వయసు అనర్హత కారణంగా పోలీసు ఉద్యోగానికి అప్లయ్ చేసుకోని వారికి ఇది పెద్ద ఊరట.
కొత్త వయోపరిమితి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నియమాలకు వర్తింపజేస్తూ ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్, ఫైర్, జైళ్లు, SPF డిపార్టుమెంట్లలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఈ వయోపరిమితి వర్తించనుంది. పోలీసు శాఖలోని పీసీ డ్రైవర్ పోస్టులకు ఈ సడలింపు వర్తించదు.
