ముషీరాబాద్, వెలుగు : సేవాలాల్ బంజారా సంఘం 10వ వార్షికోత్సవ మహాసభ ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. గాంధీ నాయక్ మాట్లాడుతూ.. బంజారాల గోర్ బోలి భాషను అధికారిక భాషగా గుర్తించాలని డిమాండ్చేశారు. ఫిబ్రవరి 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. డాక్టర్ రాజన్న, సలహాదారు వెంకటేశ్, చందు నాయక్, చక్రీ బాయి, దేవీలాల్ పాల్గొన్నారు.
