హాస్పిటల్‌‌‌‌లో అన్నా హజరే

హాస్పిటల్‌‌‌‌లో అన్నా హజరే

సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అనారోగ్యంతో హాస్పటల్‌‌‌‌లో చేరారు. దగ్గు, జలుబు, నీరసంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు పూణే దగ్గర్లోని శిరూర్‌‌‌‌ వేదాంత హాస్పటల్‌‌‌‌లో మంగళవారం ఉదయం జాయిన్‌‌‌‌ చేశారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, వయసు 82 ఏళ్లకు పైబడుతుండడంతో ఇంటివద్దే రెస్ట్‌‌‌‌ తీసుకోవడం మంచిదని డాక్టర్లు సూచించినట్టు బంధువులు చెప్పారు. అన్నా హజారే ఆయన సొంతూరు అహ్మద్‌‌‌‌నగర్ జిల్లాలోని రాలెగాన్ సిద్ధి గ్రామంలో ఉంటున్నారు.