నిరవధిక నిరాహార దీక్షపై వెనక్కి తగ్గిన హజారే

నిరవధిక నిరాహార దీక్షపై వెనక్కి తగ్గిన హజారే

రాలేగావ్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్షను చేస్తానన్న ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే వెనక్కి తగ్గారు. కేంద్రం తన డిమాండ్లలో కొన్నింటిని ఒప్పుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని హజారే స్పష్టం చేశారు. రైతులకు మద్దతుగా మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధీలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలని హజారే భావించారు. అయితే కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ హజారే డిమాండ్లలో కొన్నింటికి ఒప్పుకోవడంతో ఆయన నిర్ణయం మార్చుకున్నారు. హజారే డిమాండ్లను హై-లెవల్ కమిటీ సమీక్షించి ఆరు నెలల్లో ఓ రిపోర్టును అందజేస్తుందని కైశాష్ చెప్పారు. ఈ కమిటీలో హజారే నామినేట్ చేసిన పలువురు సభ్యులు కూడా ఉంటారన్నారు.