"అంటే సుందరానికీ" ఎంటర్ టైనింగ్ అండ్ ఎమోషనల్

"అంటే సుందరానికీ" ఎంటర్ టైనింగ్ అండ్ ఎమోషనల్

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న నేచురల్ స్టార్ కొత్త సినిమా అంటే సుందరానికీ థియేటర్లలో విడుదలైంది. దీంతో దీనికి సంబంధించిన పలు రివ్యూలు సోషల్ మీడియోలో ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీకి అదే స్థాయిలో స్పందన వస్తోంది. చాలా మంది ఫిల్మ్ స్టార్స్, నెటిజన్స్ ఈ సినిమా చూసి.. వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

నాని తన 38ఏళ్ల నటనా టాలెంట్ మొత్తాన్ని ఈ సినిమాపైనే పెట్టినట్టు తెలుస్తోంది. అతని కామెడీ టైమింగ్, నటన అన్నీ అద్భుతంగా ఉన్నాయని సినీ వర్గాల టాక్. నజ్రియా నాజిమ్ కూడా ఏం తీసిపోలేదు. ఆమె కూడా మరోసారి తెలుగు ప్రేక్షకులను తన క్యూట్ ఫర్మామెన్స్ తో ఆకట్టుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరపరిచిన సంగీతం, మ్యూజిక్ కూడా ఇంత హిట్ రెస్పాన్స్ రావడానికి ఓ కారణమైందని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.

ఇక కథ విషయానికొస్తే బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన (నాని) సుందరం, ఓ క్రిస్టియన్ అమ్మాయి(నజ్రియా)తో ప్రేమలో పడతాడు. హీరో తన పేరెంట్స్ ను ఒప్పించే పనిలో భాగంగా హీరోయిన్ ను తన ఇంటికి ఇన్ వైట్ చేస్తాడు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న సంఘటనలు ఆద్యంతం కామెడీని సృష్టిస్తాయి. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నరేష్, రోహిణి, నదియా, అళగం పెరుమాళ్, హర్ష వర్ధన్, అనుపమ పరమేశ్వరన్, పృధ్వీ రాజ్, రాహుల్ రామకృష్ణ మరియు శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి పలు పాత్రలు నవ్వులు పూయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కామెడీ, ఎమోషన్ కలగలిసిన ఈ మూవీపై అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

'అంటే సుందరానికీ'  సినిమా నాని కెరీర్‌లో 30.5 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసింది. ఇక ఈ మూవీ కలెక్షన్లు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయని సినీ వర్గాల టాక్ . ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎంటర్ టైనింగ్ అండ్ ఎమోషనల్ అని నెటిజన్స్ తమ అభిమానాన్ని చాటుతున్నారు. కామెడీ, ఎమోష‌న్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా మారాయి. నాని త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో మెస్మరైజ్ చేశాడ‌ని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.