సూరత్: గుజరాత్ లోని సూరత్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుని నలుగురు మహిళలు, ఒక చిన్నారి మృతిచెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. మిరీ ఖాదీ ప్రాంతంలో 2026 మార్చి 31న ఉదయం సుమారు 10 గంటల సమయంలో మూడు అంతస్తుల ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఇంటిని చీరల ప్యాకింగ్ పనులకు ఉపయోగిస్తున్నకుటుంబం. సెలవుదినం కావడంతో పెద్ద మొత్తంలో ఫోమ్ షీట్లు, సరుకును నిల్వ చేసుకుంది. షార్ట్ సర్క్యూ ట్ కారణంగా మంటలు చెలరేగాయి.
స్విచ్ బోర్డ్ సమీపంలో ఉన్న ఫోమ్ షీట్లు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. రసాయ నాలు కలిగిన ఫోమ్ కారణంగా భారీగా విష పూరిత పొగ ఉత్పత్తి కావడంతో ఇంటి అంతా కమ్మేసింది. భయంతో కుటుంబ సభ్యులు వెనుక గదికి వెళ్లి రక్షణ పొందాలని ప్రయ త్నించినప్పటికీ, అదే వారికి ప్రాణాంతకంగామారింది. విషవాయువులతో ఊపిరాడక తీవ్ర స్థితిలో వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
మృతుల్లో షెహ్నాజ్ బేగం అన్సారీ (65), హుసా బేగం (18), షబీనా (28), పర్విన్ (19), సుభాన్ అలీ (4) ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబు లెన్స్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. అయితే ఇంటి అంతా ఘనమైన పొగతో నిండిపోవడంతో లోపలికి వెళ్లడం మొదట కష్టంగా మారింది. పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిన తర్వాత ముందు భాగంలో, స్విచ్ బోర్డ్ దగ్గర ఫోమ్ షీట్లు నిల్వ చేసి ఉండటం గుర్తించారు. ఈ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి సూరత్కు వచ్చి చీరల ప్యాకింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తోం ది. ఘటన సమయంలో ఇంట్లో మహిళలు, చిన్నారి మాత్రమే ఉండగా, పురుషులు పనిమీద బయటకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
