మెదక్ జిల్లాలో ఆదిమానవుని కాలంనాటి చిత్రాలు

మెదక్ జిల్లాలో  ఆదిమానవుని కాలంనాటి చిత్రాలు

మెదక్: నిజాం కాలంనాటి రాతి చిత్రాలను జిల్లాలోని మంబోజిపల్లి సమీపంలోని గుట్టలలో చరిత్రకారులు గుర్తించారు. 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పైన రాతిచిత్రాలు నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న రాళ్ల గుట్టమీద కన్పించాయి. వీటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు బుర్ర సంతోష్ కను గొన్నాడు. ఈ చిత్రాల్లో రెండు తాబేళ్లు, జిగ్ జాగ్ రేఖలు, పాత్రలు 6, గొలుసు కన్నెలు ఒక వరుసలో, వెనక వేలాడే బుట్ట, చెట్ల మాదిరిగా కనిపించాయని సంతోశ్ తెలిపారు.

ఇవన్నీ అరుదైన రాతిచిత్రాల డిజైన్లు, దీర్ఘవృత్తాలు, వృత్తాలు, త్రిశూలం మాదిరిగా, తేనెపట్టు తరహాలో, సన్నని 8,9 గీతలతో కంఠహారం లెక్క కనిపించే అర్థవృ త్తం, ఇంకా అధ్యారోపణం చేయబడినవెన్నో రాతిచిత్రాలు అక్కడ ఉన్నాయని వివరించా రు. కొన్ని గుర్తించడానికి వీలుకాని డిజైన్లు ఈ రాతిచిత్రాలతావులో కనిపిస్తున్నాయని చెప్పారు. రాతిచిత్రాలన్నీ ఎరుపు రంగులో గీసినవే అన్నారు. ఈ చిత్రాలలో కొన్ని పెద రాతి యుగానికి, ఎక్కువ మట్టుకు చారిత్రక యుగానికి చెందినవని చెప్పవచ్చని చరిత్ర కారులు చెబుతున్నారు.