తల్లి పాలతో యాంటీబాడీలు

తల్లి పాలతో యాంటీబాడీలు

పాలిచ్చే తల్లులకి కరోనా సోకితే ‘బిడ్డకి పాలు ఇవ్వడం ఎలా?’ అని  టెన్షన్​ పడుతుంటారు.  అయితే, వీళ్లకి కరోనా సోకినప్పటికీ ఎలాంటి భయం లేకుండా బిడ్డకు పాలివ్వొచ్చు. అంతేకాదు ఆ పాలలో దాదాపు పది నెలలు యాంటీ బాడీలు తయారవుతూనే ఉంటాయి.  ఈ యాంటీ బాడీలు పసికందుల ఊపిరితిత్తుల్లో, పేగుల్లో వాటి గోడలకు అతుక్కుని ఉండి వైరస్​లు కానీ, బ్యాక్టీరియా కానీ శరీరంలోకి రాకుండా అడ్డుకుంటాయి  అంటున్నారు రీసెర్చర్స్. కరోనా తీవ్రత ఎక్కువ ఉన్నవాళ్లకి ట్రీట్మెంట్​లో తల్లి పాలలోని ఈ యాంటీబాడీలు పనికొస్తాయట కూడా. న్యూయార్క్​లోని  మౌంట్​ సినాయ్​ హాస్పిటల్లో డాక్టర్​గా పనిచేస్తున్న రెబెక్కా పావెల్​ తల్లి పాలలోని ఇమ్యునోగ్లోబిన్స్​ మీద రీసెర్చ్​ చేస్తుంటుంది. ఈ మధ్య ఆమె కరోనా నుంచి కోలుకున్న 75 మంది పాలిచ్చే తల్లుల శాంపిల్స్​ని టెస్ట్ చేయగా.. వాటిలోని 88 శాంపిల్స్​లో ఇమ్యునోగ్లోబిన్​–ఎ యాంటీబాడీ ఉన్నాయి. 

ఇమ్యూనిటీ పెంచుతుంది

తల్లి పాలలో ఇమ్యునోగ్లోబిన్​– ఎ అనే యాంటీబాడీ ఉంటుంది. ఇది పిల్లలను వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇమ్యూనిటీని ఇస్తుంది అని చెప్పింది రెబెక్కా.