
కొత్త తరహా కాన్సెప్టులు,డిఫరెంట్ రోల్స్‌తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్(Satyadev)..ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘కృష్ణమ్మ’(Krishnamma) మూవీ ఒకటి.కొరటాల శివ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వి. వి. గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు.
ఫస్ట్‌లుక్‌తో మెస్మరైజ్ చేసిన సత్యదేవ్..టీజర్‌తో ప్రేక్షకులకు మరింత కిక్ ఇచ్చాడు. అయితే,ఈ మూవీని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు దాన్ని మే 10కి విడుదల వాయిదా వేశారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాయి.
??????? ?? ???????, ??? ????? ?????? ?
— Primeshow Entertainment (@Primeshowtweets) April 26, 2024
The tale of fury unleashes on the big screens on May 10th ⚔️
⭐️ing @ActorSatyaDev #Krishnamma GRAND RELEASE ON ??? ?????
Grand Release by @MythriOfficial & @Primeshowtweets ✨#VVGopalakrishna… pic.twitter.com/NRcD7fSNmr
ఇందులో సత్యదేవ్ రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు.ఈ మూవీలో అతిరా రాజీ హీరోయిన్‌గా నటిస్తుండగా..కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ మూవీ కథ విషయానికి వస్తే..
విజయవాడ నగరంలో కృష్ణనది పక్కన ఉండే ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్‌కి, ఓ విలన్‌కి మధ్య జరిగే సంఘర్షణే ‘కృష్ణమ్మ’ సినిమా కథ. ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎలా పుట్టామో ఎవరికీ తెలీదు. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా పుట్టిన ప్రతివాడికీ ఏదో ఓ కథ ఉండే ఉంటుంది. కథ నడక, నది నడత ప్రశాంతంగా సాగిపోవాలంటే ఎవ్వడూ కెలకకూడదు. ఎలాంటి సంఘటన ముగ్గురి జీవితాల్ని మలుపు తిప్పింది? ఈ క్రమంలో వీరికి ఎదురైన సవాళ్లేంటి? అన్నది థియేటర్‌లో చూడాల్సిందే.