ఒక్కరోజే 70 లక్షల సిలిండర్ల బుకింగ్స్ ..సాధారణ రోజుల్లో 25 నుంచి 30 లక్షలే

ఒక్కరోజే 70 లక్షల సిలిండర్ల బుకింగ్స్ ..సాధారణ రోజుల్లో 25 నుంచి 30 లక్షలే
  • ఎక్కడా డ్రై అవుట్ లేదంటున్న కేంద్రం 
  • వదంతులతోనే ఒత్తిడి పెరిగిందని వెల్లడి
  •  అక్రమ నిల్వలపై అధికారుల దాడులు
  •  దేశవ్యాప్తంగా 15 వేల సిలిండర్ల స్వాధీనం

ఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలప్రభావం దేశంలో గ్యాస్ సరఫరాపై కనిపిస్తోంది. ఎల్పీజీ కొరత వస్తుందన్న భయంతో వినియోగదారులు భారీగా బుకింగ్స్ చేస్తున్నారు. ఒకే రోజులో సుమారు 70 లక్షల సిలిండర్లు బుక్ చేసుకున్నారు. ఇది సాధారణ  వేళల్లో రోజుకు 25 లక్షల నుంచి 30 లక్షల సిలిండర్లు బుకింగ్ అవుతాయి. గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా పానిక్ బుకింగ్స్ పెరిగిపో యాయి. ఎక్కడా గ్యాస్ పూర్తిగా ఖాళీ అయిన పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సరఫరా సజావుగానే కొనసాగుతోందని -తెలిపింది. కానీ భయంతో నిల్వలు పెంచుకోవడం వల్లే వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రపంచవ్యా ప్తంగా వివిధ మార్గాల్లో ఎల్పీజీని సేకరిస్తోంది.

హర్ముజ్ జలసంధి దాటి నిన్న శివాలి అనే నౌక భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఇవాళ నందాదేవి నౌక గుజరాత్ లోని పోర్టుకు చేరుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 22 భారత జెండా నౌకలున్నాయి. ఇవి చమురు తీసుకొస్తున్నాయి, 600 మందికి పైగా సిబ్బంది వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఇక యూఏఈ నుంచి 81 వేల టన్నుల క్రూడ్ ఆయిల్తో వస్తున్న మరో నౌక కూడా సురక్షితం గ్రా ముందుకు సాగుతోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కూడా సమృద్ధిగా ఉందని అధికారులు తెలిపారు.

అక్రమ నిల్వలపై కొరడా

అదే సమయంలో అక్రమ నిల్వలపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో దాడులు నిర్వహించింది. సుమారు 12 వేల దాడుల్లో 15 వేల సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్ము కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా తనిఖీలు జరిగాయి. పలువురిని అరెస్ట్ చేశారు. గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ భయంతో డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ సరఫరా సమృద్ధిగా ఉందని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులు పీఎస్సీకి మారితే ఒత్తిడి తగ్గుతుందని సూచించారు.

►ALSO READ | గొంతులో రసగుల్లా ఇరుక్కుని కూడా మనిషి చనిపోతాడా.. దేశంలో ఫస్ట్ టైం ఇలా..!