మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్

మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్.. ఆన్ లైన్ చిట్ చాట్ లో చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. క్రికెట్ అంటే ఆట కాదు.. అది డబ్బుు అన్నట్లు ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.. క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్ కాస్ట్ లో భాగంగా.. వీరేంద్ర సెహ్వాగ్, ఆడమ్ గిల్ క్రిస్ట్, ఇతర క్రికెటర్లు చిట్ చాట్ చేస్తూ ఉన్నారు.. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియన్ మాజీ క్రికెట్ ఆడమ్ కిల్ క్రిస్ట్.. సెహ్వాగ్ ను ఉద్దేశించి ఓ ప్రశ్న వేస్తారు..

భవిష్యత్ లో భారత క్రికెటర్లు బిగ్ బాస్ లీగ్.. (BBL) టీ 20 లీగ్ లో ఆడే అవకాశం ఉందా.. ఐపీఎల్ కాకుండా అని ప్రశ్నిస్తాడు... 

ఈ ప్రశ్నపై సెహ్వాగ్ స్పందిస్తూ.. భారత క్రికెటర్లు చాలా రిచ్.. మేం పేద దేశాల్లో క్రికెట్ ఎలా ఆడతాం.. ఐపీఎల్ కాకుండా బిగ్ బాష్ లీగ్ లో ఆడే అవకాశం లేదు.. నేను భారత జట్టులో చోటు కోల్పోయినప్పుడు నాకు బిగ్ బాష్ లీగ్ నుంచి ఆహ్వానం అందింది.. ఓ ఫ్రాంచైజీ ఆఫర్ చేసింది. ఎంత ఇస్తారు అని అడిగినప్పుడు.. వాళ్లు లక్ష డాలర్లు మాత్రమే ఇస్తారని చెప్పారు.. అంటే భారత కరెన్సీలో 84 లక్షలు మాత్రమే.. ఈ ఆఫర్ విని నవ్వుకున్నాను.. బిగ్ బాష్ లీగ్ లో వచ్చే లక్ష డాలర్ల డబ్బును.. నా సెలవుల్లో ఖర్చు చేస్తానని.. గత రాత్రి పార్టీ బిల్లు కూడా లక్ష డాలర్లు దాటింది అని చెప్పాను అంటూ సెహ్వాగ్ చెప్పటంతో.. ఆడం గిల్ క్రిస్ట్, ఇతర క్రికెటర్లు పగలబడి నవ్వటం విశేషం.. 

వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్లు ఇప్పుడు క్రికెట్ ఆటగాళ్ల ఆదాయంపై చర్చకు దారి తీసింది. క్రికెట్ అంటే ఆట కాదు.. ఆదాయంగా మారిందని.. క్రికెట్ ఆడటం అంటే డబ్బు కోసం ఆడుతున్నట్లు మారిందనే విమర్శలు వస్తున్నాయి. పేద దేశాల్లో క్రికెట్ ఆడితే డబ్బులు రావని.. బిగ్ బాష్ లీగ్ వల్ల వచ్చే డబ్బులు పార్టీలకు కూడా సరిపోవన్న ఫీలింగ్ లో భారత క్రికెటర్ల ఆలోచన ఉందని.. సెహ్వాగ్ వ్యాఖ్యలతో స్పష్టం అయింది..