ఒకే ఒక్కడు! .. లోక్ సభ ప్రచారాన్ని భుజాల మీద మోస్తున్న సీఎం రేవంత్

ఒకే ఒక్కడు! ..  లోక్ సభ ప్రచారాన్ని భుజాల మీద మోస్తున్న సీఎం రేవంత్
  • సుడిగాలి పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి ప్రతిపక్షాలతో రేవంత్
  • జపం చేయిస్తున్న సీఎం సర్వేలు, సమీక్షలు,
  • జనజాతర సభలు, రోడ్ షోలు జిల్లాల్లో సమన్వయం చేస్తున్న మంత్రులు 
  • 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును

ఒకడే ఒంటరిగా అడుగేసిండంట.. వేలాది గుండెల్లో కొలువైండంట.. అన్న చందంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదునైన విమర్శలు, సవాళ్లతో తనకంటూ బజ్ క్రియేట్ చేసుకున్న డైనమిక్ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి. తూటాల్లాంటి మాటలతో ప్రజల గుండెలను గెలిచిన మాస్ లీడర్. కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చిన 14 సీట్ల టాస్క్ ను రీచ్ అయ్యేందుకు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. లోక్ సభ ఎన్ని కల ప్రచార పర్వాన్ని తన భుజస్కందాలపై వేసుకొని అలుపెరగకుండా పర్యటనలు సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకొని వీక్ ఉన్న ప్రాంతాల్లో వాలిపోతున్నారు. స్థానిక నేతలతో చర్చిస్తున్నారు.. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. 

ప్రతిపక్షాలపై విమర్శలు సంధిస్తూనే.. ఆరు గ్యారెంటీల్లో అమలు చేసిన ఐదింటిని వివరిస్తున్నారు. సర్కారు కూలిపోతుందంటూ విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇస్తు న్నారు. టచ్ చేసి చూస్తే తడాఖా చూపిస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి తన పదునైన వాగ్ధాటితో జనాన్ని కట్టిపడేస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను తనవైపు తిప్పుకొంటున్నారు. ప్రతిపక్ష నాయకుల స్పీచ్ ఎజెండాను కూడా సీఎం సెట్ చేస్తుండటం విశేషం. ప్రతిపక్షాలన్నీ రేవంత్ జపం చేసేలా ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ రేవంత్ హవా కొనసాగుతోంది. సాక్షాత్తూ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ లో, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బరిలో నిలిచిన అలప్పుజలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

జిల్లాలో మంత్రులు

పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ చార్జులుగా వ్యవహరిస్తున్న మంత్రులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల దాఖలులో పాల్గొంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తున్నారు. పార్టీ నేతలను సమన్వయం చేస్తున్నారు. 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేయడం విశేషం.

పంద్రాగస్టు డెడ్ లైన్ 

ఆరు గ్యారెంటీల్లో కీలకమైన రైతు రుణమాఫీపై సీఎం ఇస్తున్న హామీ ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రుణమాఫీ చేతక దంటూ వెటకారం చేస్తున్న నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేసి తీరుతామని బల్లగుద్ది చెబుతున్నారు. దేవుళ్ల మీద ప్రమాణా లు చేసి మరోసారి మాట ఇస్తున్నారు. అదే సమయంలో రద్దు చేయకుంటే రాజీనామా చేస్తవా అన్న హరీశ్ రావు సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు. రుణమాఫీ అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోవాల ని సూచించారు. ఇప్పుడు అందరి దృష్టిని పంద్రాగస్టు వైపు మళ్లించారు. అలాగే నిజాం షుగర్స్ తెరిపించడానికి సెప్టెం బర్ 17ను డెడ్ లైన్ గా పెట్టారు. టార్గె ట్స్ పెట్టుకొని పనిచేయడమే కాకుండా డేట్ ఫిక్స్ చేసి మరీ చెప్పడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.