మంచిర్యాల: అక్రమంగా ఇసుక దందా చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. గురువారం (డిసెంబర్ 25) ఆయన చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పలు చర్చ్‌లలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మంచి మద్దతు ఇచ్చారని అన్నారు.
చెన్నూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని స్థానాలను కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు గెలిచారన్నారు. కొన్ని చోట్ల డబ్బు ఆశ చూపి పదవులు దక్కించకున్నారని విమర్శించారు. ఇసుక దందా చేసి అక్రమంగా సంపాదించిన డబ్బులతో కొందరు పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందారని.. వాళ్లది అసలు గెలుపే కాదని అన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు బయటి వాళ్లకు సహకరించారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.
