RashmikaVijay: "ఇట్స్ హాలిడే టైమ్".. న్యూ ఇయర్ వైబ్‍లో రష్మిక-విజయ్ దేవరకొండ !

RashmikaVijay: "ఇట్స్ హాలిడే టైమ్".. న్యూ ఇయర్ వైబ్‍లో రష్మిక-విజయ్ దేవరకొండ !

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో సారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్ షిప్ పై నెట్టింట రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ .. ఈ జంట మాత్రం ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.  ఈ ఏడాది అక్టోబర్‌లో వీరిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని, వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.  అయితే లేటెస్ట్ గా వీరిద్దరూ కలిసి విదేశీ పర్యటనకు బయలదేరడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వీరి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన జంట..

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న జంటగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇద్దరూ మాస్కులు ధరించినప్పటికీ, నెటిజన్లు వారిని వెంటనే గుర్తుపట్టేశారు. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  గత కొన్ని నెలలుగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఈ స్టార్స్.. కాస్త విరామం దొరకడంతో హాలిడే మూడ్‌లోకి వెళ్ళిపోయారు.

►ALSO READ | Prabhas: 'ది రాజా సాబ్' నుంచి అదిరిపోయే క్రిస్మస్ గిఫ్ట్.. వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్!

ఇట్స్ హాలిడే టైమ్..

విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఆసక్తికరమైన ఫోటోను పంచుకున్నారు. అందులో విజయ్ రిలాక్స్‌డ్ మూడ్‌లో ఉండగా, రష్మిక అతనిని ఒక పోలరాయిడ్ కెమెరాతో ఫోటో తీస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని నెలలగా ఫుల్ సినిమా షూటింగ్స్ తర్వాత.. ఇప్పుడు హాలిడే టైమ్ అంటూ విజయ్ క్యాప్షన్ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారని సమాచారం.  అయితే  కొత్త ఏడాది వేడుకల కోసం ఈ జంట ఎక్కడికి వెళ్తోంది అన్నదానిపై అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఈ వెకేషన్ నుంచి రష్మిక ఏవైనా ఫోటోలు షేర్ చేస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ 'రౌడీ' జంట తమ పెళ్లిపై అధికారిక ప్రకటన చేయాలని కోరుతున్నారు .