ప్లాస్మా డోనర్స్ కోసం యాప్

ప్లాస్మా డోనర్స్ కోసం యాప్

బీబీఏ స్టూ డెంట్ ను ప్రశంసించిన గవర్నర్

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన మాశెట్టి సాయి వేద ప్రకాశ్ ప్లాస్మా డోనర్స్, రిసీవర్స్ కోసం ‘ఆరోగ్య వేద’ పేరుతో యాప్ ను రూపొందించాడు. హైదరాబాద్ ప్రగతి మహా విద్యాలయలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రకాశ్ వారం రోజుల్లో ఈ యాప్ ను డిజైన్ చేశాడు. యాప్ గురించి ఈ నెల 24న రాజ్ భవన్ కు మెయిల్ చేయగా అధికారులు గవర్నర్ తమిళి సైతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రకాశ్ ను ప్రశంసించిన గవర్నర్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. యాప్ ను పూర్తి స్థాయి లో డెవలప్ చేసేందుకు ‘బుక్ మై షో’ సంస్థ ముందుకు వచ్చిందని ప్రకాశ్ తెలిపాడు.