హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో ఆర్ట్ టీచర్ల భర్తీకి సంబంధించి సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుందని గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. వచ్చే నెల 24 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే బోర్డు వెబ్‌సైట్‌లో పెడతామని తెలిపింది. ఎగ్జామ్‌కు వారం రోజుల ముందు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతామని చెప్పింది. కాగా, మొత్తం 132 పోస్టులుండగా, ఇందులో మహిళలకే 112 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఎగ్జామ్ రాసిన తర్వాత మార్కుల మెమో కావాలంటే రూ.200 ఫీజు చెల్లించి పొందవచ్చని నోటిఫికేషన్‌లో బోర్డు వెల్లడించింది.

