గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2026 ఏప్రిల్ 27 (సోమవారం) శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఇద్దరికీ ఈ సందర్భంగా సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్సీలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
ప్రొ.జయశంకర్కు ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తా: కోదండరాం
- చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాను
- లక్ష్యాలను ఎంచుకొని పని చేస్తా
- నాకు మంత్రి పదవి పై ఆశ లేదు
- పీజు రియంబర్స్మెంట్, ఉద్యమ కారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిస్కారం కోసం పని చేస్తా
- ఇప్పటి వరకు చేస్తున్న పనిని సమర్ధ వంతంగా పని చేయడానికి నాకు ఎమ్మెల్సీ ఉపయోగ పడుతుంది
- అనేక కేసులు, అనేక ఇబ్బందులు పడ్డా
- నా పని ఆగలేదు.. కొనసాగుతుంది
- గతంలో ఏ రకంగా జీవన శైలి ఉందొ భవిషత్తులో కూడా అదేవిధంగా ఉంటుంది
- ప్రజల కోసం నిలబడతా.. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా
- పదవులు అనేవి శాశ్వతం కాదు
- ఒకాయన నేను పోరాడుతానా లేదా అని అన్నారు నేను పోరాడి చూపిస్తా
అజారుద్దీన్ కామెంట్స్:
- నాకు పొలిటికల్ ఫాన్స్ కంటే క్రికెట్ ఫాన్స్ ఎక్కువ..
- పొలిటికల్ ఫాన్స్ ని కూడా పెంచుకుంటాను.
- ప్రజల కోసం ఇంకా కష్టపడి పని చేస్తాను.
- మైనారిటీ ల అభివృద్ధి కోసం కృషి చేస్తాను.
- సీఎం రేవంత్ మైనారిటీ ల కోసం చాలా చేశారు.
- రాజకీయాల్లో క్లీన్ బోల్డ్ ఉండదు
- రాజకీయాల్లో చూస్తూ ఆడుకుంటూ వెళ్లిపోవాలి

