ఏదైనా అనారోగ్యానికి గురైనపుడు డాక్టర్ సలహా మేరకు లేదా.. నేరుగా మెడికల్ స్టోర్ నుంచి మందులు కొంటుంటా. కానీ.. మెడిసిన్స్ ప్యాకెట్స్ పైన ఉండే రెడ్ స్ట్రైప్ (ఎర్రని చార) గురించి అంతగా గమనించం. చూసినా ఏదో డిజైన్ కోసం అనుకునే వాళ్లే ఎక్కువ. చాలా మందికి ఆ లైన్ ఎందుకు ఉంటుందో తెలియదు. దాని మీనింగేంటో చూద్దాం.
వాస్తవానికి రెడ్ స్ట్రై్ప్స్ అనేవి ప్రభుత్వం ఇచ్చే సిరియస్ వార్నింగ్ సింబల్స్. దాన్ని మరిచిపోవడం హెల్త్ కు డేంజర్ మాత్రమే కాదు.. బాడీలో డ్రగ్ రెసిస్టెన్స్ పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. డ్రగ్ రెసిస్టెన్స్ అంటే మందులు అలవాటైన తర్వాత.. కొన్నాళ్లకు ఆ మందులు మన బాడీకి పనిచేయకపోవడం. అందుకే దీని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
రెడ్ లైన్ అర్థమేంటి..
మెడిసిన్ పైన రెడ్ స్ట్రైప్ ఉందంటే.. ఆ మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప కనటానికి, అమ్మటానికి వీలు లేదు
రెడ్ లైన్ ఉందంటే దాదాపు యాంటి బయాటిక్స్ ఉన్నట్లు. అనవసరంగా వాడితే డ్రగ్ రెసిస్టెన్స్ ప్రాబ్లమ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది
ఏ కెమిస్ట్ రెడ్ స్ట్రైప్ ఉన్న మెడిసిన్ ను డైరెక్టుగా అమ్మరు. అలా అమ్మటం చట్ట పరంగా నేరం.
ఎందుకు ఈ రెడ్ లైన్ ముఖ్యం:
- జలుబు వంటి చిన్న కారణానికి కూడా జనాలు యాంటీ బయాటిక్స్ వాడుతుంటారు. సొంత చికిత్సను నివారించేందుకు ఈ లైన్స్ వేస్తుంటారు.
- రెడ్ స్ట్రైప్ సింబల్ ఉన్న మెడిసిన్ హెవీ డోస్ వేసుకుంటే కడ్నీ, లివర్, అలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది
- ఈ మందులు ఎన్నాళ్లు వాడాలో డాక్టర్ డిసైడ్ చేస్తారు. అదే విధంగా ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా వైద్యులు నిర్ధారిస్తారు. అలా కాకుండా సొంతంగా వేసుకుంటే తీవ్ర ప్రమాదాలు ఎదురవటం ఖాయం.
-
మందులు కొనే ముందు ఇవి గుర్తించుకోండి:
Rx అనే లేబుల్ తో పాటు రెడ్ స్ట్రైప్ ఉంటే.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. NRx ఉంటే అది నార్కోటిక్ డ్రగ్ అని అర్థం. నార్కోటిక్ డ్రగ్స్ అంటే నొప్పిని నివారించి.. నిద్రను ప్రేరేపించేవి. వీటికి అలవాటు పడితే మెల్లగా బానిలసయ్యే ప్రమాదం ఉంటుంది
మెడిసిన్ పైన ఉండే స్ట్రైప్ ను చెక్ చేయడంతో పాటు తయారీ డేట్, ఎక్స్ పైరీ తేదీలను కూడా గమనించండి.
-
సలహా:
ఎర్ర గీత ఉన్న మందులను ఇతరుల సలహా మేరకు గానీ లేదా పాత ప్రిస్క్రిప్షన్ ఆధారంగా గానీ ఎప్పుడూ కొనవద్దు.
ఒకవేళ డాక్టర్ ఎర్ర గీత ఉన్న మందును సూచించినట్లయితే, లక్షణాలు తగ్గిన తర్వాత కూడా పూర్తి కోర్సును వాడటం మంచిది.

