V6 News

మీ ఫోన్ సైలెంట్‌లో ఉన్నా పదే పదే చూస్తున్నారా..? అయితే అసలు కారణం ఇదే!

మీ ఫోన్ సైలెంట్‌లో ఉన్నా పదే పదే చూస్తున్నారా..? అయితే అసలు కారణం ఇదే!

మనం నిద్రలేవగానే మనసు కుదుటపడకముందే మన చేయి ఫోన్ వైపు వెళ్తుంది. ఏ మెసేజ్ రాకపోయినా, ఫోన్ మోగకపోయినా స్క్రీన్ ఆన్ చేసి చూస్తాం. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. అందుకే ఫోన్‌లో 'డూ నాట్ డిస్టర్బ్' ఫీచర్ ఆన్ చేసినా మన మనసు మాత్రం ప్రశాంతంగా ఉండలేకపోతోంది.

1. సమస్య ఫోన్ కాదు.. ఆలోచనే!
చాలా మంది ఫోన్‌ను రివర్స్లో  పెట్టినా లేదా సైలెంట్ చేసినా కంట్రోల్లో ఉన్నామని అనుకుంటారు. కానీ, సమస్య నోటిఫికేషన్లు రావడం కాదు. అవి రాకపోయినా మనం వాటి కోసం వెతకడమే అసలు సమస్య. డిజిటల్ డిటాక్స్ నిపుణురాలు చెప్పినట్లుగా, బయటి వ్యక్తులు మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు, మనకు మనమే డిస్టబెన్స్ కలిగించుకుంటున్నాము అని చెప్పారు. 

2. 'డూ నాట్ డిస్టర్బ్' ఎందుకు 
ఈ సెట్టింగ్ ఫోన్‌ను సైలెంటులో  ఉంచుతుంది కానీ, మీ అలవాటును మార్చలేదు. ఎవరైనా మెసేజ్ చేశారా ? ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా ? అని మీ మనసు ఆరాటపడుతూనే ఉంటుంది. అందుకే సెట్టింగ్స్ మార్చడం కంటే, మీ ప్రవర్తనను మార్చుకోవడం ముఖ్యం.

3. మనకు కావాల్సింది 'డిజిటల్ డిటాక్స్'
మీరు ఆఫ్‌లైన్‌లోకి వెళ్తున్నప్పుడు ఈ విషయాన్ని ఇతరులకు తెలియజేయడం ఒక మంచి పద్ధతి. ఉదాహరణకు, మీ వాట్సాప్ స్టేటస్‌లో 'నేను డిజిటల్ డిటాక్స్‌లో ఉన్నాను' అని పెట్టడం వల్ల మీకు రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి మీరు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ఒత్తిడి తగ్గుతుంది. మరొకటి అవతలి వారికి మీరు ఎందుకు రిప్లై ఇవ్వడం లేదో స్పష్టత వస్తుంది.

4. అలవాటును మార్చుకోవడానికి 
సాంకేతికత సమస్య కాదు, దానికి మనం హద్దులు పెట్టుకోకపోవడమే సమస్య. ఈ చిన్న మార్పులు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే  తెలుస్తుంది.  నిద్రలేచిన తర్వాత మొదటి 30 నుండి 60 నిమిషాల వరకు మొదటి గంటసేపు ఫోన్ ముట్టుకోవద్దు. భోజనం చేస్తున్నప్పుడు లేదా కుటుంబికులతో ఉన్నప్పుడు ఫోన్‌ను పక్క గదిలో ఉంచండి.

మీరు కొంతసేపు అందుబాటులో ఉండటం లేదని నిర్ణయించుకుని, ఆ విషయాన్ని ముందే  స్పష్టంగా ఇతరులకు స్టేటస్ ద్వారా తెలియజేయండి. మొత్తంగా ఫోన్ సైలెంట్ మోడ్ అనేది మీ మెసేజెస్, కాల్స్, నోటిఫికేషన్స్  ఆపగలదు కానీ మీ ఆలోచనలను కాదు. మనం ఫోన్ నుండి దూరంగా ఉండటం అంటే ప్రపంచం నుండి తప్పుకోవడం కాదు, మన కోసం మనం కొంత సమయాన్ని, ప్రశాంతతను వెతుక్కోవడం. ఆ మార్పు మీ మనసులో తీసుకునే నిర్ణయం నుండే మొదలవుతుంది.