V6 News

మనుషులను ప్రింట్ చేసే మెషిన్‌‌.. ఈ ‘‘జెరాక్స్’’ వెబ్ సిరీస్ స్టోరీ భలే ఉందిగా..!

మనుషులను ప్రింట్ చేసే మెషిన్‌‌.. ఈ ‘‘జెరాక్స్’’ వెబ్ సిరీస్ స్టోరీ భలే ఉందిగా..!
  • టైటిల్: జెరాక్స్
  • ప్లాట్​ ఫాం : జీ5
  • డైరెక్షన్ : శ్రీనిధి బెంగళూరు
  • కాస్ట్​ : నాగభూషణ్​, పాయల్ చెంగప్ప, మంజు పావగడ, ఓం ప్రకాశ్​ రావు, శ్రీవత్స, యశ్వంత్ శెట్టి

ప్రకాశ్​(నాగభూషణ్) ఒక అనాథ. తన మామయ్య (ఓం ప్రకాశ్​ రావు) దగ్గర పెరుగుతాడు. అతను రాయదుర్గం అనే చిన్న టౌన్‌‌లో ఒక జిరాక్స్ షాప్‌‌ను నడుపుతుంటాడు. ప్రకాశ్ కూడా అతనికి సాయంగా ఉంటాడు. ఆ షాప్‌‌లో ఉన్న పాత జిరాక్స్‌‌ మెషిన్  పదే పదే పాడవుతూ ఉంటుంది. ఒకరోజు రాత్రి ప్రకాశ్​ తన గర్ల్‌‌ఫ్రెండ్ సూజీ (పాయాల్ చెంగప్ప)తో మాట్లాడి తిరిగి షాప్‌‌కు చేరుకుంటాడు. అదే టైంలో జిరాక్స్ మెషిన్‌‌ పని చేయడం ఆగిపోతుంది. 

అప్పుడే వాళ్ల మామయ్య షాప్‌‌ నుంచి వెళ్లిపోతూ అతని ఐడీ కార్డ్‌‌ మెషిన్‌‌లో పెట్టి మర్చిపోతాడు. ఆ తర్వాత ప్రకాశ్​ మెషిన్‌‌ని బాగుచేసి ఆన్ చేయగానే దానినుంచి వాళ్ల మామయ్య వస్తాడు. అంటే ఆ మెషిన్‌‌ మనుషులను కూడా డూప్లికేట్​ చేయగలిగే సూపర్‌‌ పవర్‌‌‌‌గా మారిందని తెలుసుకుంటాడు. ఆ పవర్‌‌‌‌తో ప్రకాశ్​ ఏం చేశాడు? తెలియాలంటే ఈ వెబ్‌‌సిరీస్‌‌ చూడాలి.