V6 News

చెలరేగిన CSK కెప్టెన్ రుతురాజ్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే!

చెలరేగిన CSK కెప్టెన్ రుతురాజ్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే!

IPL 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. కాగా గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి వచ్చిన  CSK ఆదిలోనే తడబడింది. కేవలం 26 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో ఎల్లో ఆర్మీపై బాగా ఒత్తిడి పెరిగింది.  

మొదట బ్యాటింగ్ కి వచ్చిన సీఎస్కే ఓవపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ జోడి ఆశించిన స్థాయిలో ఆరంభం అందించలేకపోయింది. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న 21 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. కగిసో రబాడ బౌలింగ్ (3.3 ఓవర్లో)లో భారీ షాట్ ఆడగా అది కాస్త బ్యాట్ ఎడ్జికి తాకడంతో బంతి నేరుగా వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతిలో వెళ్లి పడటంతో సంజు మైదానం వీడాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఊర్విల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 3 బంతులు ఆడి ఒక ఫోర్ కొట్టిన తర్వాత బంతికే రబాడ బౌలింగ్ (3.6 ఓవర్లో)లోనే జేసన్ హోల్డర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. 
 
అనంతరం క్రీజులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ ఈసారి ఘోరంగా విఫలమయ్యాడు. ఎలాంటి ఇంపాక్ట్ చూపించకుండానే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. దీంతో 26 పరుగులకే కీలకమైన వికెట్లని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్పోయి, తీవ్ర కష్టాల్లో పడింది. కాగా, తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు మెరిపించకుండానే మైదానం వీడాడు. కేవలం 5 రన్స్ మాత్రమే చేసి మానవ్ సుథార్ బౌలింగ్ లో శుభ్‌మన్ గిల్ కి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లిపోయాడు. దీంతో 37 పరుగులకే 4 వికెట్లని నష్టపోయింది సీఎస్కే. 

ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన శివమ్ దూబేతో కలిసి సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 6 పోర్లు, 4 సిక్సులతో 74 పరుగులు) అద్భుతమైన అర్థ శతకంతో జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, ఈ ఇద్దరు మొదట్లో నెమ్మదిగా పరుగులు చేసినప్పటికీ, 14వ ఓవర్ తర్వాత నుంచి దూకుడు పెంచింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య నెలకొన్న 59 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. 96 పరుగుల వద్ద అర్షద్ ఖాన్ బౌలింగ్ (15.3)లో దూబే క్లిన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు కార్తిక్ శర్మ భారీ షాట్స్ తో విరుచుకుపడిన తర్వాత కగిసో రబాడ బౌలింగ్(17.5) లో డకౌట్ కి వెళ్లిపోయాడు.  తర్వాత వచ్చిన జేమీ ఓవర్టిన్ కేవలం 6 బంతుల్లోనే 18 పరుగులు చేసిన తర్వాత అర్షద్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయినప్పటికీ, గైక్వాడ్ మాత్రం చివరి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 158 పరుగులు చేసింది. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడ 3 వికెట్లు తీసుకోగా, అర్షద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా, మహమ్మద్ సిరాజ్, మానవ్ సుథార్ తలో వికెట్ తీసుకున్నాడు.