V6 News

శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి పొన్నం దంపతులు.. స్వాగతం పలికిన ఆలయ అధికారులు,అర్చకులు

శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి పొన్నం దంపతులు.. స్వాగతం పలికిన ఆలయ అధికారులు,అర్చకులు

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం దగ్గర  ఆలయ అధికారులు,అర్చకులు స్వాగతం పలికారు.  మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు మల్లన్న  స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. 

దర్శనం తరువాత  అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేదపండితులు, అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈఓ శ్రీనివాస రావు భ్రమరాంబ సమేత  మల్లికార్జున స్వామి  తీర్థ ప్రసాదాలను, శేష వస్తాలను, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కు అందజేశారు.