ఆయుష్‌‌ డైరెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్‌‌

ఆయుష్‌‌ డైరెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్‌‌‌‌గా ఐఏఎస్ అధికారి, జాయింట్ సెక్రటరీ అయేషా మస్రత్ ఖానమ్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆమెకు ఆయుష్‌‌ శాఖ డైరెక్టర్‌‌‌‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటివరకు ఆయుష్‌‌ శాఖ డైరెక్టర్‌‌‌‌గా ఎఫ్‌‌ఏసీ బాధ్యతల్లో ఉన్న ప్రొఫెసర్ పి. శ్రీకాంత్ బాబును ఆ పదవి నుంచి రిలీవ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం అయేషా మస్రత్ ఖానమ్‌‌ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌‌మెంట్‌‌లో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

దీంతో పాటు సివిల్ సప్లైస్ జాయింట్ సెక్రటరీగా కూడా పూర్తి అదనపు బాధ్యతల్లోఉన్నారు. ఇప్పుడు వీటికి అదనంగా ఆయుష్ శాఖ డైరెక్టర్‌‌ బాధ్యతలను కూడా తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఆమె నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజు మెమో జారీ చేశారు.