- పెండ్లి గోల
- టైటిల్ : హ్యాపీరాజ్
- ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
- డైరెక్షన్ : మరియా రాజ్
- కాస్ట్ : జీవీ ప్రకాష్ , శ్రీ గౌరీ ప్రియ, అబ్బాస్, జార్జ్ మరియన్, గీతా కైలాసం, మహేశ్ దేవి
హ్యాపీ రాజ్ (జీవీ ప్రకాష్) అందంగానే ఉన్నప్పటికీ అతన్ని ఏ అమ్మాయి ప్రేమించదు. అందుకు కారణం అతని తండ్రి ఆనంద్ రాజ్(జార్జ్ మరియన్). అతను పొట్టిగా, నల్లగా ఉంటాడు. అతని రూపం, ఆకారం వల్ల అందరూ ఎగతాళి చేస్తుంటారు. కొందరు కుదిరై ముట్టై (గుర్రపు గుడ్డు) అని పిలుస్తుంటారు.
అతని కొడుకుగా పుట్టినందుకు హ్యాపీరాజ్‌ని చిన్న గుర్రపు గుడ్డు అని ఎగతాళి చేస్తుంటారు. అందుకే తండ్రికి దూరంగా వెళ్లిపోయి తన కుటుంబం గురించి తెలియని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు హ్యాపీ.
ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించి బెంగళూరుకు మకాం మార్చేస్తాడు. అక్కడ తన సీనియర్ కావ్య (శ్రీ గౌరీ ప్రియ)ను కలుస్తాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కావ్య హ్యాపీని తన ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. కావ్య తండ్రి రాజీవ్(అబ్బాస్) కూడా వాళ్ల పెండ్లికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాలి.

