కరోనా నుంచి మమ్మల్ని భగవంతుడే కాపాడాలి

కరోనా నుంచి మమ్మల్ని భగవంతుడే కాపాడాలి

హెల్త్ మినిస్టర్ బి.శ్రీరాములు వ్యాఖ్యలు
చిత్రదుర్గ: కర్నాటక హెల్త్ మినిస్టర్ బి.శ్రీరాములు తమ రాష్ట్రంలో వైరస్ కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేవుడు మాత్రమే తమను రక్షించగలడన్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడం ఎవరి చేతుల్లోనూ లేదని కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌గా ఉన్న శ్రీరాములు చెప్పారు. కర్నాటకలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటగా.. మహమ్మారి బారిన పడి 900 మంది వరకు చనిపోయారు.

‘భగవంతుడు మాత్రమే మమ్మల్ని కాపాడగలడు. మా గురించి మేం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ ఇన్ఫెక్షన్స్‌ ఎక్కువవుతున్నాయి. మహమ్మారికి పేద, ధనిక, కులం, ప్రాంతం లాంటి తేడాలు ఉండవు. దానికి ఎలాంటి క్లాస్, క్యాస్ట్‌ డిఫరెన్సెస్ తెలియవు. ఇప్పటినుంచి 100 శాతం కేసులు పెరగుతాయి. కేసుల పెరుగుదలకు ప్రభుత్వ వైఫల్యం, మంత్రుల బాధ్యతారాహిత్యం, మినిస్టర్స్‌ మధ్య కోఆర్డినేషన్ లేదని విమర్శించొచ్చు కానీ అది ఎవరి చేతుల్లోనూ లేదు’ అని శ్రీరాములు పేర్కొన్నారు.