ఆర్టికల్ 35-A రద్దుపై కేంద్ర ప్రభుత్వంపై అసదుద్ధీన్ విమర్శలు

ఆర్టికల్ 35-A రద్దుపై కేంద్ర ప్రభుత్వంపై అసదుద్ధీన్ విమర్శలు

ఆర్టికల్ 35-A రద్దు విషయంలో మరోసారి మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు  MP, MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. అస్సాంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లోనూ ఎవరూ బయటి వ్యక్తులు భూములు కొనలేరని… అలాంటిది కశ్మీర్ ను ఎందుకు బూచిగా చూపిస్తున్నారని ప్రశ్నించారు. నాగాలాండ్, మిజోరం, మణిపూర్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ లకు కూడా కశ్మీర్ పరిస్థితే వస్తుందని హెచ్చరించారు. పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. నాగాలండ్ లోనూ రెండు జెండాలున్నాయన్నారు ఒవైసీ. ప్రజలను మూర్ఖులను చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు అసదుద్దీన్.