డ్రాతో గట్టెక్కిన ఇండియా

డ్రాతో గట్టెక్కిన ఇండియా


చెన్నై: సొంతగడ్డపై ఆసియా చాంపియన్స్‌‌ ట్రోఫీని ఘన విజయంతో  ప్రారంభించిన ఇండియా మెన్స్‌‌ హాకీ టీమ్‌‌ అదే జోరు కొనసాగించలేకపోయింది. శుక్రవారం జరిగిన తమ రెండో మ్యాచ్‌‌లో ఇండియా 1–1తో జపాన్​పై డ్రాతో గట్టెక్కింది. బలమైన డిఫెన్స్‌‌తో అదరగొట్టిన జపాన్‌‌కు 28వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌‌ ద్వారా కెన్‌‌ నగయోషి గోల్‌‌ అందించాడు. మూడో క్వార్టర్‌‌ వరకూ ఆ జట్టు ఆధిక్యాన్ని కాపాడుకుంది. 

అయితే, 43వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌‌ను సద్వినియోగం చేసుకుంటూ కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ గోల్‌‌ చేయడంతో ఇండియా 1–1తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లూ మరో గోల్‌‌ కొట్టకపోవడంతో మ్యాచ్‌‌ డ్రా అయింది. దాంతో రెండు జట్లు చెరో పాయింట్‌‌ సాధించాయి. ఇతర మ్యాచ్‌‌ల్లో మలేసియా 5–-1తో చైనాను ఓడించగా, కొరియా, పాకిస్తాన్‌‌ మధ్య పోరు 1–1తో డ్రాగా ముగిసింది.  ఆదివారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌‌లో మలేసియాతో ఇండియా పోటీ పడనుంది.