Australian Open Super 500 badminton tournament: ఒలింపిక్ మెడలిస్ట్, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు (PV Sindhu) ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌లో అదరగొట్టింది. సిడ్నీ వేదికగా ఈరోజు (శుక్రవారం) జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు వన్-సైడ్ గేమ్‌తో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యును అసలు కోలుకోనివ్వకుండా కేవలం 27 నిమిషాల్లోనే మట్టికరిపించి తన పవరేంటో చూపించింది. 2024 డిసెంబర్‌లో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ కప్ కొట్టిన తర్వాత.. మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్న సింధుకు ఈ విక్టరీ ఒక పెద్ద బూస్టింగ్ అనే చెప్పాలి.
27 నిమిషాల ఆట.. ప్రత్యర్థికి చుక్కలు:
* ఈ మ్యాచ్‌లో థర్డ్ సీడ్ గా బరిలోకి దిగిన పీవీ సింధు.. స్టార్టింగ్ నుంచే కోర్టులో ఫుల్ డామినేషన్ చూపించింది. ప్రత్యర్థి చెన్ సు యుకు అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా.. కోర్టు మొత్తం కవర్ చేస్తూ ప్రెజర్‌లో పడేసింది.
* ఫస్ట్ గేమ్: సింధు దెబ్బకు ప్రత్యర్థి కేవలం 6 పాయింట్లే చేయగలిగింది. 21–6 తో ఫస్ట్ గేమ్‌ను సింధు ఈజీగా కైవసం చేసుకుంది.
* సెకండ్ గేమ్: అదే జోష్‌ను కంటిన్యూ చేస్తూ సెకండ్ గేమ్‌ను కూడా 21–-9తో గెలిచేసి మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా ముగించేసింది. దీనికంటే ముందు ప్రి-క్వార్టర్స్‌లో మన భారత్ కు చెందిన ఇషారాణి బారువాను ఓడించి సింధు క్వార్టర్స్‌కు చేరిన సంగతి తెలిసిందే.
సెమీస్‌లో యమగుచితో ఢీ!
రేపు (శనివారం) జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌లో పీవీ సింధుకు అసలైన సవాల్ ఎదురుకానుంది. టోర్నీ టాప్ సీడ్, జపాన్ స్టార్ ప్లేయర్ అకానె యమగుచితో సింధు తలపడనుంది. క్వార్టర్ ఫైనల్లో భారత్ టీనేజర్ తన్వి శర్మను 21–14, 21–14 తేడాతో ఓడించి యమగుచి సెమీస్‌కు చేరుకుంది. కాగా వరల్డ్ నెంబర్ 3 ప్లేయర్ అయిన యమగుచిపై సింధుకి మంచి రికార్డు ఉంది. వీరిద్దరూ ఇప్పటి వరకు తలపడిన మ్యాచుల్లో సింధు 15–13తో స్వల్ప ఆధిక్యంలో కనిపిస్తుంది.
TOTAL DOMINATION BY PV SINDHU 🔥🔥🔥
— The Khel India (@TheKhelIndia) June 12, 2026
She defeated Chen Su 🇹🇼 21-6, 21-9 in the Quaterfinals of Australian Open (Super 500) 💥
WELL DONE CHAMP! 🇮🇳🙌pic.twitter.com/lveUzUnaxK
#AustralianOpen2026
— Vinayakk (@vinayakkm) June 12, 2026
PV Sindhu takes the opening game with ridiculous ease. From 7-5 to 21-6, on a run of 14 out of 15 points. Once she started controlling the net, Chen Su-yu had no answers pretty much.
This was really the one rally of note & Sindhu moving well.
🎥 BWF pic.twitter.com/lnW5VbK8Ox
