ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తైన సందర్భంగా శుక్రవారం ( జూన్ 12 ) తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి లోకేష్. రాజకీయాల్లో విరాట్ కోహ్లీ అని.. అటు బౌలర్లు మరచ్చేమో కానీ.. బ్యాట్స్ మెన్ సీబీఎన్ ఒక్కడే అని అన్నారు. అటు వైపు బౌలర్ ఎవరైనా సిక్స్ కొట్టేది మాత్రం సీబీఎన్ అని అన్నారు లోకేష్.
రాయలసీమను రాయల్ సీమగా మార్చేది చంద్రబాబేనని.. అప్పుడు కియా, ఇప్పుడు రాయల్ ఎన్ ఫీల్డ్ తెచ్చారని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ తో సీమలో బంగారం పండేలా చేసింది చంద్రబాబే అని... హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా కుప్పానికి నీళ్లు ఇచ్చింది సీబీఎన్ అని అన్నారు. పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చింది సీబీఎన్ అని అన్నారు. ఇప్పుడు లక్ష కోట్లతో మిషన్ రాయలసీమ స్టార్ట్ చేసింది మన చంద్రబాబే అని అన్నారు లోకేష్.
ప్రజాప్రభుత్వంలో ప్రశాంతంగా జనం
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం రెండేళ్ళు పూర్తిచేసుకుందని.. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రశాంతత వచ్చిందని అన్నారు. దాడులు లేవు, జేసీబీలు, కబ్జాలు, హత్యలు, బెదిరింపులు, బూతులు కూడా లేవని అన్నారు. రాష్ట్రంలో ఉన్నది ఒక్కటే ప్రశాంతత అని... ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని ప్రశాంతంగా ఉన్నారని అన్నారు లోకేష్.
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే చంద్రగిరి గడ్డపై నేను ఒక మాట చెప్పానని... వెంకన్న చాలా పవర్ ఫుల్...అయనతో పెట్టుకోవద్దు... మాడి మసై పోతావు అని జగన్ కి చెప్పానని... ఆయనకి అర్దం కాలేదు..డైరెక్ట్ గా స్వామితోనే పెట్టుకున్నారని అన్నారు. 2024లో ఏం జరిగిందో మీరంతా చూశారని అన్నారు లోకేష్.
నందమూరి తారక రామారావు గారికి సీమ అంటే ప్రేమ అని... రాయలసీమకు కరువు వస్తే జోలె పట్టి ప్రజలను ఆదుకుంది ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు గంగ, గాలేరు - నగరి ప్రాజెక్ట్స్ రూపకల్పన చేసింది ఎన్టీఆర్ అని... రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, 50 హార్స్ పవర్ విద్యుత్, తిరుమలలో నిత్య అన్నదానం ప్రారంభించింది ఎన్టీఆర్ అని అన్నారు లోకేష్..
ప్రజలే వారిని రఫ్పాడిస్తారు
2019 నుండి 2024 వరకు గొడ్డలి పార్టీ అరాచక పరిపాలన మనం చూశామని... బీసీ బిడ్డ అమర్‌నాథ్ గౌడ్ పై పెట్రోలు పోసి చంపేశారని అన్నారు. దళిత వైద్యుడు సుధాకర్ గారిని పిచ్చోడని ముద్ర వేసి చంపేశారని... డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసి డోర్ డెలివరీ చేశారని... అబ్దుల్ సలామ్ కుటుంబంతో సామూహికంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారని అన్నారు.
కుటుంబాన్ని విడిచి మిస్బా ఆత్మహత్య చేసుకునేలా చేశారని... టీడీపీ జెండా లేకుండా చేస్తాం అన్నారు, ప్రజలే వాళ్ల జెండా పీకేశారని ఎద్దేవా చేశారు. వై నాట్ 175 అన్నారు. ప్రజాలు టీమ్ 11 ఇచ్చారని అన్నారు. వాళ్లు సిద్ధం అంటే...ప్రజలు యుద్ధం అన్నారని... మమ్మల్ని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వం అన్నారు, ప్రజలే వాళ్లని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశారని అన్నారు. ఇప్పుడు రప్పా రప్పా అంటున్నారు – ప్రజలే రఫ్పాడిస్తారని అన్నారు లోకేష్.
