అమెరికాకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ దిగ్గజం 'ఓపెన్‌డోర్' భారత్‌లో తన వ్యాపారాన్ని క్లోజ్ చేసింది. భారతదేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల దేశంలోని చెన్నై, బెంగళూరు ఆఫీసుల్లో పనిచేస్తున్న దాదాపు 250 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే రోడ్డున పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా టెక్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఖర్చులు తగ్గించుకునేందుకే..
ఓపెన్‌డోర్ అనేది ప్రధానంగా అమెరికాలో ఇళ్లను ఆన్‌లైన్ ద్వారా నేరుగా కొనుగోలు చేసి, వాటిని తిరిగి విక్రయించే వ్యాపార నమూనాను నడుపుతోంది. అయితే భారత దేశంలోని ఆఫీసుల ద్వారా కంపెనీకి అవసరమైన టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, బ్యాక్-ఎండ్ సపోర్ట్ సేవలను ఇక్కడి ఉద్యోగులు అందించేవారు. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న ఆర్థిక పరిస్థితులు, నిధుల కొరత, ఖర్చుల మదింపులో భాగంగానే భారత్‌లోని ఆపరేషన్లను పూర్తిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది.
ALSO READ : BYD పెట్రోల్ కమ్ ఈవీ కారు.
ఉద్యోగులకు షాక్.. ప్యాకేజీలతో వీడ్కోలు
కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే లేఆఫ్స్‌కు గురైన ఉద్యోగులను ఆదుకునేందుకు కంపెనీ కొంతవరకు సెవెరెన్స్ ప్యాకేజీలను, అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలను వెతుక్కునేందుకు అవసరమైన కెరీర్ సపోర్ట్‌ను అందిస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ టెక్ కంపెనీలు రీస్ట్రక్చరింగ్ పేరిట చేస్తున్న ఉద్యోగాల కోత ఇప్పట్లో ఆగేలా లేదని తాజా పరిణామం మరోసారి నిరూపించింది. ఇండియా ఆపరేషన్స్ క్లోజ్ చేసిన ఓపెన్‌డోర్.. ఇకపై పూర్తి స్థాయిలో తన అమెరికా మార్కెట్‌పైనే దృష్టి పెట్టనుందట.
