ఏఐ దెబ్బకు monday.comలో 600 మంది అవుట్.. ఒక్క ఏడాదిలోనే 1.4 లక్షల ఉద్యోగాలు మటాష్ !

ఏఐ దెబ్బకు monday.comలో 600 మంది అవుట్.. ఒక్క ఏడాదిలోనే 1.4 లక్షల ఉద్యోగాలు మటాష్ !

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పుణ్యమా అని టెక్ రంగంలో ఉద్యోగాల కోత జోరుగా సాగుతోంది. తాజాగా Monday.com అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తుంది. ఏఐ వృద్ధి వ్యూహంలో భాగంగా  మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో 20% మందిని, అంటే దాదాపు 600 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

 ఖర్చులు తగ్గించుకోవడానికి కాకుండా, ఏఐ-ఫస్ట్ లక్ష్యాలను చేరుకోవడానికి, పనులను స్పీడ్ అప్ చేయడానికి ఈ కోతలు చేస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. కేవలం 2026 ప్రారంభం నుంచే అమెరికా టెక్ కంపెనీలు దాదాపు 1 లక్ష 40 వేల ఉద్యోగాలను పీకేశాయి. ఇందులో అమెజాన్, ఒరాకిల్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలే ముందున్నాయి.

ఏఐ వల్లే ఉద్యోగాలు తీస్తున్నామని ప్రకటించిన కంపెనీల షేర్లు మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ ప్రకటనలు చేసిన నెల రోజుల్లోనే ఇవి నాస్‌డాక్ కంటే 10% తక్కువ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. అంటే, ఏఐ పేరుతో కంపెనీలు చేస్తున్న ఈ కోతలను మార్కెట్ పూర్తిగా నమ్మడం లేదు.

 అన్ని చోట్లా ఉద్యోగాలు పోవడమే కాదు, ఓపెన్‌ ఏఐ (OpenAI), ఆంథ్రోపిక్ (Anthropic) వంటి ఏఐ కంపెనీలు కొత్త నియామకాలు చేపడుతున్నాయి. మెటా, ఐబీఎం వంటి సంస్థలు పాత ఉద్యోగులను తీసేస్తూనే, మరోపక్క ఏఐ సంబంధిత కొత్త పాత్రలలోకి ఉద్యోగులను మారుస్తున్నాయి.

2026లో ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన కొన్ని ప్రముఖ కంపెనీలు:
అమెజాన్: 16,000 కార్పొరేట్ ఉద్యోగాలు
మైక్రోసాఫ్ట్: సుమారు 4,800 ఉద్యోగాలు
మెటా: 8,000 మంది తొలగింపు 
గూగుల్: క్లౌడ్ విభాగంలో ఇంకా మేనేజర్ పోస్టుల్లో కోతలు
డెల్: సుమారు 11,000 ఉద్యోగాలు

ALSO READ : గుడ్ న్యూస్.. ఇక UPI పేమెంట్స్కు ఇంటర్నెట్ అవసరం లేదు !

చివరికి టెక్ కంపెనీలు పనులన్నీ ఏఐతో చేయించుకోవాలని చూస్తుండటంతో, సాధారణ ఉద్యోగాల అవసరం పూర్తిగా మారిపోతోంది. పాత పద్ధతిలో చేసే ఉద్యోగాలు తగ్గిపోతుండగా, ఏఐ (AI) స్కిల్స్ ఉన్న వారికి మాత్రం కొత్త అవకాశాలు పెరుగుతున్నాయి.