ఏపీలో దసరా, సంక్రాంతి సెలవులు ఇవే

ఏపీలో దసరా, సంక్రాంతి సెలవులు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ పూర్తి స్థాయి అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు ఉండగా... విద్యార్థులకు 87 రోజులను సెలవు దినాలుగా విద్యాశాఖ ఖరారు చేసింది.

విద్యార్థులు ఎంతగానో ఎదురుచూసే పండుగ సెలవుల వివరాలను కూడా ప్రభుత్వం ఈ క్యాలెండర్‌లో ప్రకటించింది. ఈ ఏడాది దసరా సెలవులను అక్టోబర్ 12వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు.. మొత్తం 10 రోజుల పాటు ఇవ్వనున్నారు. అలాగే, సంక్రాంతి పండుగ సెలవులను వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ నుండి జనవరి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

►ALSO READ | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై హ్యూమన్ కమిషన్ సీరియస్.. సుమోటోగా విచారణ.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు..

ఇక పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 2027 మార్చి 15వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో స్పష్టం చేసింది.ఇక  ప్రతి శనివారాన్ని నో  బ్యాగ్ డే (No Bag Day) గా అమలు చేయనున్నారు.