పోలీస్టేషన్ కు తీసుకెళితే.. రెండో అంతస్తు నుంచి దూకేశాడు

పోలీస్టేషన్ కు తీసుకెళితే.. రెండో అంతస్తు నుంచి దూకేశాడు
  • అసిఫ్ నగర్ పోలీసు స్టేషన్లో దారుణం

హైదరాబాద్: ఆసిఫ్ నగర్ పోలీస్  స్టేషన్లో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన వ్యక్తి.. పోలీసులు తనను ఏం చేస్తారని భయపడ్డాడో పోలీసులను ఏమార్చి ఊహించనిరీతిలో రెండో అంతస్థు పైనుంచి దూకేశాడు. హఠాత్తుగా క్షణాల్లో జరిగిపోయిన ఘటనతో పోలీసులు తేరుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే వెస్ట్ జోన్ డిసిపి, ఆసిఫ్ నగర్ ఏసిపి  ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. 
ఓ కేసు విషయంలో ఓ వ్యక్తిని పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు. అతడ్ని ప్రశ్నించేందుకు, విచారించేందుకు తీసుకొచ్చినట్ల పోలీసులు చెబుతున్నారు. పోలీసుల నుంచి తనకు హాని ఉందని భయపడ్డాడో ఏం జరిగిందో కానీ.. సదరు వ్యక్తి పోలీసులను ఏమార్చి రెండో అంతస్తుపై నుంచి దూకేశాడు. అతడు చేసిన చర్యను ఊహించని పోలీసులు వెంటనే తేరుకుని కిందపడి తీవ్ర రక్తస్రావం అవుతున్న వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పట్టపగలు, జనం రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో జరిగిన ఘటన కలకలం రేపింది. విషయం తెలియడంతో వెస్ట్ జోన్ డీసీపీ, ఆసిఫ్ నగర్ ఏసీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులు అసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ కు చేరుకుని సిబ్బందిని విచారిస్తున్నారు.