అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

మొన్నటి వరకు వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన అసోం, ఈశాన్య ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. గౌహతిలో గురువారం 38.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాదారణం కంటే 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువ. నగరంలో గడిచిన 30 ఏళ్లలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం రెండోసారి. ఈశాన్య రుతుపవనాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన తరువాత, ఈశాన్య  భారతంలో ఈ వారం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గౌహతిలో 2018 జులైలో రికార్డు స్థాయిలో 38.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. అసోంతోపాటు ఈశాన్య రాష్ట్రాలు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ అస్సాంలోని సిల్చార్‌లో 39.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వడం.. జులైలో నగరంలో ఇదే రెండవ అత్యధిక ఉష్ణోగ్రత. త్రిపుర, మేఘాలయ, షిల్లాంగ్ లో కూడా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.