కరోనా ఎఫెక్ట్‌: 100 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్స్ క్లోజ్‌

కరోనా ఎఫెక్ట్‌: 100 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్స్ క్లోజ్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రెండుస్టేట్స్‌కి బోర్డర్స్‌ క్లోజ్‌ చేసినట్లు విక్టోరియా ప్రీమియర్‌‌ డానియల్‌ అండ్రూవ్స్‌ చెప్పారు. మంగళవారం నుంచి బోర్డర్స్‌ పూర్తిగా క్లోజ్‌లో ఉంటాయని అన్నారు. న్యూ సౌత్‌ వేల్స్‌తో బోర్డర్స్‌ 100 ఏండ్ల తర్వాత క్లోజ్‌ చేసినట్లు అధికారులు చెప్పారు. 1918–19లో స్పానిష్‌ ఫ్లూ సమయంలో బోర్డర్స్‌ క్లోజ్‌ చేశామని, ఇప్పుడు మళ్లీ మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విక్టోరియా క్యాపిటెల్‌లో కేసులు రోజు రోజుకు పెరగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు 30 సబ్‌అర్బర్స్‌లో స్ట్రిక్ట్‌ సోషల్‌ డిస్టెంసింగ్‌, పబ్లిక్‌ హౌసింగ్‌ టవర్స్‌లో పూర్తి లాక్‌డౌన్‌ విధించారు. “ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సరైన టైమ్‌లో సరైన నిర్ణయం తీసుకోవడంతో ఇది సమానం” అని ఆండ్రీవ్‌ మీడియాతో చెప్పారు. ప్రధాని స్కాట్‌ మారిసన్‌, ఎన్‌ఎస్‌డబ్యలూ ప్రీమియర్‌‌ గ్లాడీస్‌ బెర్జికిలన్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. మిగతా దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 8500 కేసులు నమోదయ్యాయి. కానీ మెల్‌బోర్న్‌లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని అధికారులు చెప్పారు. గత వారం రోజులుగా రోజుకు దాదాపు 109 కేసులు నమోదవుతున్నాయని అన్నారు.