నంబర్ వన్ ప్లేయర్ కు షాక్

నంబర్ వన్ ప్లేయర్ కు షాక్

ప్రపంచ నెంబర్ వన్ టెన్సిస్ ప్లేయర్ జకోవిచ్ కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. అతని వీసా రద్దు చేసినట్లు ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఇందుకు కారణం జకోవిచ్ చేసిన తప్పులే. అతడు గత వారం మెల్‌బోర్న్‌కు వచ్చినప్పుడు ఇమ్మిగ్రేషన్ పత్రాలతోసహా కోవిడ్-సమాచారానికి సంబంధించి అనేక తప్పులు చేశాడు. జకోవిచ్ సమర్పించిన ఫారంలో అతను ఆస్ట్రేలియాకు ఫ్లైట్ ఎక్కేముందు 14 రోజులు ప్రయాణించలేదని సమాచారం అందించింది. 

అయితే ఫ్లైట్ తీసుకునే ముందు ప్లేయర్ స్పెయిన్, సెర్బియాలో రెండు వారాల పాటు కనిపించాడు. ఈ సెర్బియన్‌ ఆటగాడు గతవారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టగానే బోర్డర్‌ ఫోర్స్ అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. వాక్సినేషన్‌కు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేనందున అతడి వీసాను రద్దు చేయడంతో పాటు, అతడిని ఇమ్మిగ్రేషన్‌ నియంత్రణలోని ప్రత్యేక హోటల్‌కు తరలించారు. ఈ నేపథ్యంలోనే న్యాయపోరాటం చేసిన జకోవిచ్‌ తాజాగా కేసు గెలిచాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు అతడి వద్ద వైద్యపరమైన మినహాయింపులకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, దీంతో అతడి వీసాను పునరుద్ధరించాలని న్యాయమూర్తి ఆంటోని కెల్లీ ఆదేశాలిచ్చారు. 

ఆస్ట్రేలియాలో ఉండేందుకు జొకోవిచ్‌ను కోర్టు అనుమతించింది. నివేదికల ప్రకారం, అతనికి కరోనా సోకింది. అయినప్పటికీ, గత నెలలో అతను తన దేశం సెర్బియాలో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాడు.  కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ తాను జర్నలిస్టును కలిశానని జకోవిచ్ స్వయంగా అంగీకరించాడు. అతను ఆస్ట్రేలియాలో ప్రవేశించడానికి ఇమ్మిగ్రేషన్ ఫారమ్‌లో చేసిన పొరపాట్లతో ఇప్పటికీ అతని వీసా రద్దు చేయవచ్చుననే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా అధికారులు జకోవిచ్ వీసాను రద్ద చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఇవి కూడా చదవండి:

ఈ యూట్యూబ్ వీడియోకి వెయ్యి కోట్ల వ్యూస్!

సోదరి ఇంట్లో బాలయ్య సంక్రాంతి సంబరాలు