కేసీఆర్ లేకపోతే నేను లేను..ఆయన వల్లే నాకు గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ లేకపోతే నేను లేను..ఆయన వల్లే నాకు గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ లేకపోతే  తాను లేనని.. ఆయన వల్లే తనకు  గుర్తింపు వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహాభారతంలో శకుడు లేకుంటే కృష్ణుడు లేడన్నారు.  ఇవాళ్టితో సన్నబియ్యం పంపిణీకి ఏడాది  పూర్తికావడంతో అసెంబ్లీ హాల్ లో ఇవాళ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి లంచ్ చేశారు సీఎం రేవంత్.

 ఈ సందర్భంగా చిట్ చాట్ చేసిన రేవంత్..  కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అందరు అనుకుంటున్నారు కానీ.. కేసీఆర్ ను  కేటీఆర్,హరీశ్  గృహనిర్భందం చేశారని ఆరోపించారు. కాలనాగుకంటే హరీశ్ ప్రమాదకరమని విమర్శించారు. 86 శాతం మంది జనాలకు  సన్నబియ్యం  అందుతుందన్నారు.  ఆహార కల్తీ నియంత్రించేందుకు   హైడ్రా,ఈగల్ తరహాలోనే  ప్రత్యేక వ్యవస్థ తెస్తామన్నారు రేవంత్.  

డీలిమిటేషన్ పై  దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు రేవంత్.   లోక్ సభలో రాష్ట్రాలకు ఇపుడున్న నిష్పత్తి తగ్గొద్దని అన్నారు.  దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయంపై చెన్నైలో మీటింగ్ పెట్టాం.. త్వరలోనే తెలంగాణలో కూడా పెడ్తామని చెప్పారు.  డీలిమిటేషన్ పై  బండి సంజయ్, లక్ష్మణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. రాబోయే రోజుల్లో  ఉన్న ఎంపీ పదవి కూడా పోతుందని విమర్శించారు రేవంత్.