విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేతకు నిరసనగా మహిళా కార్మికులు ఆందోళనకు దిగారు. బుధవారం ( ఆగస్టు 19 ) ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మహిళా కార్మికులు. నెల జీతానికి బతికే తాము ఇంటి అద్దె కట్టలేకపోతున్నామని... పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు మూసివేత కారణంగా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని.. ప్రభుత్వానికి తమ కష్టాలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.
తమకు తగిన న్యాయం చేయకపోతే నిరాహార దీక్ష చేస్తామని.. ఒకవేళ తాము ఆత్మహత్యలు చేసుకుంటే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని హెచ్చరించారు మహిళా కార్మికులు. ఎయిర్ పోర్టు కార్మికులకు ఏం న్యాయం చేస్తారో అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
ALSO READ : 24 గంటల్లోనే విజయ్ సర్కార్ యూ-టర్న్..
భోగాపురం ఎయిర్ పోర్టుకు తాము వ్యతిరేకం కాదని... విశాఖ ఎయిర్ పోర్టును పూర్తిగా మూసివేయడానికి వీల్లేదని అన్నారు కార్మికులు. తమకు తగిన న్యాయం చేయకపోతే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు కార్మికులు.
