Jaiswal IPL Offer: గాలేలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన మైండ్ గేమ్స్ అండ్ స్లెడ్జింగ్‌తో నెట్టింట ట్రెండింగ్ అయ్యాడు. టీమిండియా 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచ్ ఐదో రోజు ఉదయం, శ్రీలంక సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాతో జైస్వాల్ చేసిన సరదా చాట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేసి లంకను ఆదుకున్న డిక్వెల్లా వికెట్ ఎంత కీలకమో తెలిసిన జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అతని దగ్గరకు వెళ్లి తొలి ఇన్నింగ్స్‌లాగే ఇక్కడ కూడా భారీ షాట్ కొట్టు, ఒక సిక్స్ కొడితే నిన్ను ఐపీఎల్‌లోకి తీసుకెళ్తా అంటూ సరదాగా ప్రొవోక్ చేశాడు. దానికి డిక్వెల్లా నన్ను ఐపీఎల్‌లోకి తీసుకెళ్తేనే కొడతా అని చెప్పగా, ఖచ్చితంగా 100 శాతం తీసుకెళ్తాం, నువ్వు ముందు సిక్స్ కొట్టు అని జైస్వాల్ ఛాలెంజ్ విసిరాడు.
జైస్వాల్ ట్రాప్‌లో పడిన డిక్వెల్లా:
జైస్వాల్ వేసిన ఈ మైండ్ ట్రాప్‌లో డిక్వెల్లా పడిపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆ ఓవర్‌లోనే పెద్ద షాట్‌కు ప్రయత్నించి, ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్‌కు క్యాచ్‌గా దొరికిపోవడంతో కేవలం 10 పరుగులకే అవుటై పెవిలియన్ బాట పట్టాడు. తను వేసిన స్కెచ్ వర్కవుట్ కావడంతో జైస్వాల్ ఆనందంతో మెరిసిపోగా, టీమిండియా సహచర ఆటగాళ్లంతా అతడి మైండ్ ట్రిక్స్‌ను మెచ్చుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అంతకుముందు ఐదో రోజు ఆటలో లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా (59), సోనాల్ దినుషాలు 95 పరుగుల భాగస్వామ్యంతో పోరాడినప్పటికీ, రవీంద్ర జడేజా డీ సిల్వాను ఔట్ చేసి ఇండియాకు కీలకమైన బ్రేక్‌త్రూ అందించాడు.
పడిక్కల్, మానవ్ సుతార్ల ఆల్‌రౌండ్ షో:
అనంతరం భారత బౌలర్లు విజృంభించి శ్రీలంకను కట్టడి చేయడంతో భారత జట్టు 165 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 167 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు సాధించిన దేవ్ దత్ పడిక్కల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని దక్కించుకున్నాడు. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్ కూడా బ్యాటింగ్‌తో మంచి సహకారం అందించగా, యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి మొత్తం 10 వికెట్లతో మ్యాచ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.
ALSO READ : గాలేలో మానవ్ సుతార్ వన్ మ్యాన్ షో.. లంకపై 10 వికెట్లతో చెలరేగిన యంగ్ స్టార్ హిస్టరీ ఇదే!
PEAK TEST CRICKET. 😂
— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026
Yashasvi Jaiswal and Niroshan Dickwella serving up some good old-fashioned Test match banter. 👀
Watch #SLvIND 2nd Test, starting 23rd August 9 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/KP8M2WUgFg
