IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టుతో గౌహతిలోని బర్సపరా స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నైకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ గాయంతో తొలి రెండు వారాలు అందుబాటులో ఉండడని ఫ్రాంచైజీ ప్రకటించింది. దీంతో జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌పై ప్రత్యేక దృష్టి ఉంది. గతంలో రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు ఇప్పుడు సీఎస్కేలోకి మారి తొలి మ్యాచ్ ఆడనున్నాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్, మాథ్యూ షార్ట్, శివం దూబేలు బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. అయితే డెవాల్డ్ బ్రెవిస్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటు అని చెప్పాలి. ఇక బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
తక్కువ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్:
రాజస్థాన్ జట్టు విషయానికి వస్తే, వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆరంభం ఇవ్వాలని చూస్తున్నారు. యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. జోఫ్రా ఆర్చర్, ఆడమ్ మిల్నే, రవీంద్ర జడేజా లాంటి బౌలర్లు జట్టుకు అదనపు బలం. గౌహతిలోని బర్సపరా స్టేడియంలోని పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా కాదు.. ఇక్కడ బౌలర్లే ఎక్కువగా ఆధిపత్యం ప్రదర్శిస్తారు. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు సుమారు 146 పరుగుల వరకు ఉంటుంది. పెద్ద స్కోర్లు చాలా అరుదుగా నమోదవుతాయి.
హెడ్ టు హెడ్ రికార్డులు:
ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడగా, చెన్నై 16, రాజస్థాన్ 16 మ్యాచ్‌లలో గెలిచి సమానంగా నిలిచాయి. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇరు జట్లలో బలమైన ఆటగాళ్లు ఉండటంతో అభిమానులకు ఆసక్తికర పోరుని అందించే అవకాశం ఉంది.
పిచ్ రిపోర్ట్:
గౌహతిలోని బర్సపరా స్టేడియంలో పిచ్ ఫ్లాట్‌గా ఉండే అవకాశం ఉంది. లక్ష్యాన్ని ఛేదించే జట్టు పైచేయి సాధించే ఛాన్స్ కనిపిస్తుంది. వికెట్‌పై కొంత గడ్డి ఉన్నప్పటికీ, అది కేవలం ఉపరితలాన్ని పట్టుగా ఉంచడానికే మాత్రమే.. మంచు ప్రభావం వలన వేగవంతమైన అవుట్‌ఫీల్డ్ స్పిన్నర్లకు సమస్యగా మారనుంది.
RR vs CSK ప్లేయింగ్ XI:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, ఆడమ్ మిల్నే.
ఇంపాక్ట్ ప్లేయర్ : అమన్ రావు
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్ : కార్తిక్ శర్మ
