సోదరి ఇంట్లో బాలయ్య సంక్రాంతి సంబరాలు

సోదరి ఇంట్లో బాలయ్య సంక్రాంతి సంబరాలు

ఒంగోలు: ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంక్రాంతి వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో తన అక్క కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో భోగి వేడుకలు చేసుకున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ, మరికొంత మంది దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసుకున్నారు. గ్రామస్తులు,  అభిమానులు పెద్ద సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి వచ్చారు. ఐతే కరోనా కారణంగా ఎవరినీ లోపలికి అనుమతించలేదు.