ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలీటిలో హంగ్ ఏర్పడింది. మెజారీటి మార్క్కు నాలుగు సీట్ల దూరంలో బీజేపీ నిలిచింది. బీజేపీకి 21, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఎంఐఎం 6, స్వతంత్రులు 5 వార్డుల్లో గెలిచారు. మొత్తం ఆదిలాబాద్ మున్సిపాలీటిలో 49 వార్డులు ఉన్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులకు పోలింగ్ జరగ్గా 69.04 పోలింగ్ శాతం నమోదైంది.
70.55 శాతం పురుషులు, 67.62 శాతం మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళ ఓటు శాతం భారీగా తగ్గింది. మొత్తం 73,836 మంది మహిళా ఓటర్లు ఉండగా 49,926 మంది మాత్రమే ఓటు వేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్తో పాటు పది మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్ జరిగింది. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్తో పాటు బెల్లంపల్లి, క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లోని 149 వార్డుల్లో 444 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
►ALSO READ | రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ వశం: బంపర్ మెజార్టీతో క్లీన్ స్వీప్
